Hamas Attack : ఉగ్రవాదుల‌ పంజా ఇజ్రాయెల్ గ‌జ గ‌జ‌

భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం

Hamas Attack : ఇజ్రాయెల్ – హ‌మాస్ టెర్రరిస్టుల మెరుపు దాడుల ప‌రంప‌ర ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఓ వైపు అమెరికా ఇజ్రాయెల్ కు వంత పాడుతోంది. ఆరు నూరైనా స‌రే యుద్ద నేరానికి పాల్ప‌డ్డార‌ని , ఎక్క‌డ ఉన్నా ప‌ట్టుకుని తీరుతామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతోంది ఇజ్రాయెల్. బ‌దులు తీర్చుకోవ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తోంది.

Hamas Attack in Israel Viral

వ‌రుస దాడుల నేప‌థ్యంలో భారీ ఎత్తున ఆస్తులు ధ్వంసం అయ్యాయి. పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంది. ఇంకా దాడులు కొన‌సాగుతూనే ఉండ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం సంయ‌మ‌నం పాటించాల‌ని హ‌మాస్(Hamas ) ఉగ్ర మూక‌ల‌కు విన్న‌వించింది. అయినా ఫ‌లితం లేకుండా పోయింది.

దాడుల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇజ్రాయెల్ లో ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు 1,008 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,418 మంది గాయ‌ప‌డ్డారు. గాజా న‌గ‌రంలో 800 మంది మ‌ర‌ణించారు. 4,250 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇక వెస్ట్ బ్యాంక్ లో 19 మంది మృతి చెంద‌గా 110 మంది గాయ‌ప‌డ్డారు. లెబ‌నాన్ లో 5 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ దాడుల్లో మొత్తం 1,862 మంది మృతి చెందితే 7,773 మంది గాయ‌ప‌డ్డారు. ఇజ్రాయెల్ లో 1,500 మంది హ‌మాస్ ఉగ్ర‌వాదులు ప‌ట్టుబ‌డ్డారు.

Also Read : Nara Lokesh : ఆధారాలు లేకుండా విచారిస్తే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!