Amit Shah : హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై

ఒప్పందం చేసుకున్న కేంద్రం

Amit Shah : న్యూఢిల్లీ – న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో గ‌త 40 ఏళ్లుగా అస్సాంలో వేర్పాటు వాదం వినిపిస్తూ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ వ‌స్తోంది ఉల్ఫా ఉగ్ర‌వాద సంస్థ‌. ఈ తీవ్ర‌వాద సంస్థ సాగించిన దాడులు, చేప‌ట్టిన ఆకృత్యాలకు పాల్ప‌డింది. కేంద్రం ఆధీనంలోని క్రైమ్ బ్యూరో వెల్ల‌డించిన ప్ర‌కారం దాదాపు అస్సాంలో 10 వేల మందికి పైగా ఉల్ఫా ఉగ్ర‌వాద సంస్థ పొట్ట‌న పెట్టుకుంది.

Amit Shah Comment

అంతే కాదు యావ‌త్ దేశం ఉలిక్కి ప‌డేలా భ‌యాందోళ‌న‌కు గురి చేసింది ఉల్ఫా. ఇదే స‌మ‌యంలో రైళ్లు, బ‌స్సుల‌ను టార్గెట్ చేసింది. అస్సాంలో తీవ్ర అల్ల‌క‌ల్లోలానికి గురి చేసింది. భార‌త్ లో వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న చైనా , పాకిస్తాన్ దేశాల‌తో చేతులు క‌లిపారు ఉల్ఫా ఉగ్ర‌వాద సంస్థ నిర్వాహ‌కులు.

భార‌త సైన్యంపై, పౌర స‌మాజంపై తీవ్ర‌మైన దాడుల‌కు పాల్ప‌డింది. తాజాగా కేంద్రం ముందుకు వ‌చ్చింది. ఉల్ఫా సంస్థ‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. ఈ మేర‌కు కేంద్ర స‌ర్కార్ త‌ర‌పున కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) నేతృత్వంలో ఉల్ఫా ప్ర‌తినిధులు విస్తృతంగా చ‌ర్చించారు. ఇక నుంచి హింస‌ను వ‌దిలి వేసి జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌లిసి పోవాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఒప్పందం ఖ‌రారు చేసి..సంత‌కాలు చేశారు. దీంతో నాలుగు ద‌శాబ్ధాల హింస‌కు తెర ప‌డింది.

Also Read : Chandra Babu Naidu : అంగ‌న్ వాడీల‌కు బాబు భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!