Ram Charan Amit Shah : రామ్ చరణ్ కు అమిత్ షా సన్మానం
మెగాస్టార్ చిరంజీవి సంతోషం
Ram Charan Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ప్రముఖ నటుడు , మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను అభినందించారు(Ram Charan Amit Shah). ఈ సందర్బంగా తన నివాసంలో రామ్ చరణ్ ను శాలువా కప్పి సత్కరించారు.
రామ్ చరణ్ తో పాటు తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఎనలేని సంతోషానికి లోనయ్యారు. ఇదిలా ఉండగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (రుద్రం-రణం-రౌద్రం) చిత్రంలో ఏపీకి చెందిన యోధుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించాడు.
ఇక ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకు చెందిన యోధుడు కొమురం భీం పాత్రలో మెప్పించాడు. ఈసందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. అంతకు ముందు ఎన్నో అవార్డులను స్వంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకు సంబంధించి ఆస్కార్ అవార్డు 2023కు ఎంపికైంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీ అవార్డును స్వంతం చేసుకుంది.
లాస్ ఏంజెల్స్ లోని కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన గేయ రచయిత చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దీనికి సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవ పాడారు. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఆస్కార్ దక్కింది. రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా (Ram Charan) అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read : ఉగాదికి రానున్న రంగమార్తాండ