Amit Shah : అమిత్ చంద్ర షా. మోదీ వెనుక నీడలా ఉండేది ఆయనే. ప్రధాని అనుంగు అనుచరుల్లో అతడే కీలకం. ఆయన ఒక్కసారి ఎంటర్ అయ్యాడంటే వార్ వన్ సైడ్ కావాల్సిందే.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇటీవల దేశంలోని 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలను రిహార్సల్స్ గా భావించింది భారతీయ జనతా పార్టీ.
అంతే కాదు వాటిని సెమీ ఫైనల్స్ గా తీసుకుంది. కొందరికి రాజకీయాలంటే ఆట విడుపు.
కానీ మోదీ త్రయానికి ( మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) ఇది అతి పెద్ద టాస్క్. అందుకే వ్యూహాలు రచించడంలో,
ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో, ఊహించని రీతిలో దెబ్బ కొట్టడంలో అమిత్ షా(Amit Shah) తర్వాతే ఎవరైనా.
బీజేపీలో ఆయన మాటకు ఎదురు లేదు. ఆయన చెబితే ప్రధాని మోదీ చెప్పినట్టే. మోదీ ప్లాన్ చేస్తాడు.
అమిత్ షా (Amit Shah)ఆచరిస్తాడు అన్న అపవాదు లేక పోలేదు. కానీ వాటిని వీరిద్దరూ ఎక్కువగా పట్టించుకోరు.
వారిద్దరూ ఏకాంతంగా ఏం మాట్లాడుకుంటారో ఎవరికీ తెలియదు. కానీ మోదీ ప్రభుత్వ రథానికి అమిత్ షా(Amit Shah) రథసారథి అన్నది మాత్రం చెప్పక తప్పదు.
పార్టీలో ఆయనే సుప్రీం. ఏ నిర్ణయం తీసుకున్నా మోదీ కనుసన్నలలోనే కొనసాగుతుంది.
అది అమలు జరిగి తీరాల్సిందే. సామాన్యంగా అమిత్ చంద్ర షా ఎక్కడా అడుగు పెట్టడు.
కానీ ఒక్కసారి అడుగు పెట్టాడంటే భూకంపం రాక పోవచ్చు కానీ తాము అనుకున్నది చేసి వెళ్లి పోతాడు.
మిగతా వాళ్లంతా తేరుకునే లోపే విజయం వారి వాకిట్లోకి వచ్చేసి ఉంటుంది.
ఒకానొక దశలో యోగీని ప్రకటిస్తారా లేదా అన్న అనుమానం నెలకొంది. కానీ యోగి మామూలోడు కాదు కదా.
అందుకే మోదీ ఆలోచనలకు రూప కల్పన చేసేది మాత్రం ట్రబుల్ షూటర్ అమిత్ షానే(Amit Shah).
యోగీ సైతం వారి టీంలోని సభ్యుడే. ఈసారి మరోసారి పవర్ లోకి వచ్చేందుకు వీరు ముగ్గురు కలిసి కష్టపడ్డారు.
అనుకున్నది సాధించారు. ఇవాళ రెండోసారి యోగి సీఎం కాబోతున్నాడు.
దీనికి మోదీ మార్క్ ఉంటే షా పాత్ర తప్పక ఉంది. ఏది ఏమైనా అమిత్ షా బీజేపీలో కింగ్ మేకర్.
Also Read : దీదీ జగమెరిగిన ధీర వనిత