Amit Shah: 2029లోనూ ఎన్డీఏదే అధికారం – అమిత్‌ షా

2029లోనూ ఎన్డీఏదే అధికారం - అమిత్‌ షా

Amit Shah: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను హోం మంత్రి అమిత్‌ షా ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మునిగిపోబోయే నావ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం దిగ్విజయంగా మరో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవమే గాక 2029లోనూ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు విపక్షాలు మరోసారి అదే పాత్రకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలని జోస్యం చెప్పారు.

Amit Shah Comment

‘‘ప్రతిపక్షాలు ఏమైనా చెప్పనీయండి. 2029లోనూ ఎన్డీఏదే అధికారం. మోదీయే ప్రధాని’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్షాలు కాస్త విజయానికే ఎన్నికల్లో గెలిచేసినట్లు సంబరపడుతున్నాయి. కాంగ్రెస్‌ గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో కలిపి సాధించిన సీట్లను బీజేపీ ఒక్క 2024 ఎన్నికల్లోనే సాధించింది,’’ అని అన్నారు. మోదీ ప్రభుత్వం కొనసాగదంటూ కావాలనే అయోమయం సృష్టించేందుకు మళ్లీమళ్లీ విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. వాటన్నింటికీ కాలమే సమాధానం చెప్తోంది అన్నారు.

Also Read : Kiran Kumar Reddy : సీఎం చంద్రబాబు ఏపీని అగ్రస్థానంలో నిలబెడతారు

Leave A Reply

Your Email Id will not be published!