Atul Mishra Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్ పండిస్తున్న ఇంజ‌నీర్

సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ అతుల్ మిశ్రా స‌క్సెస్ స్టోరీ

Atul Mishra Dragon Fruit :  ఒక‌ప్పుడు వ్య‌వ‌సాయం అంటే చిన్న చూపు. కానీ సీన్ మారింది. సిస్ట‌మ్ మారింది. వ్య‌వ‌సాయమే మేల‌ని న‌మ్ముతున్నారు నేటి యువ‌తీ యువ‌కులు.

కొంద‌రు సాగు రంగాన్ని ఎంచుకుంటే మ‌రికొంద‌రు సాగుకు సంబంధించిన ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. డెయిరీని కూడా మ‌ధ్యే మార్గంగా లాభ‌సాటిగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

తాజాగా కంప్యూట‌ర్ ఇంజ‌నీర్ అయిన అతుల్ మిశ్రా డ్రాగ‌న్ ఫ్రూట్(Atul Mishra Dragon Fruit) సాగు చేస్తూ ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. ఇత‌డిది యూపీలోని షాజ‌హాన్ పూర్ అల్లాగంజ్ ప‌రిధ‌ఙ‌లోని చిల‌హువా గ్రామానికి చెందిన వ్య‌క్తి.

అతుల్ మిశ్రా చెన్నై లో కంప్యూట‌ర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశాడు. కంప్యూట‌ర్ రిలేటెడ్ జాబ్స్ వ‌చ్చినా ఎందుకనో దానిపై మ‌క్కువ చూప‌లేదు. ఏకంగా వ్య‌వ‌సాయ రంగానికే ప్ర‌యారిటీ ఇచ్చాడు మ‌నోడు.

త‌న తోటి గ్రామ‌స్థుల‌కు ఏదైనా చేసి జిల్లాకు కీర్తి ప్ర‌తిష్ట‌లు తీసుకు రావాల‌నే ఉద్దేశంతో చ‌దువు పూర్త‌య్యాక ఎక్కువ జీతం వ‌చ్చే జాబ్ కు వెళ్లాల‌ని అనుకోలేద‌న్నాడు అతుల్ మిశ్రా.

ఇంట‌ర్నెట్ లో సెర్చ్ చేశాడు. చివ‌ర‌కు డ్రాగ‌న్ ఫ్రూట్ ను సాగు చేయాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. 2018లో మ‌హారాష్ట్ర లోని షోలాపూర్ నుండి పితాహ‌య

అని పిలిచే డ్రాగ‌న్ ఫ్రూట్ కు చెందిన కొన్ని మొక్క‌లు తీసుకు వ‌చ్చాడు.

త‌న కుటుంబానికి చెందిన బంజ‌రు భూమిలో నాటాడు. వీటి ద్వారా మంచి ఆదాయం ల‌భించ‌డంతో త‌న‌కు ఉన్న ఐదు ఎక‌రాల‌లో పండ్ల సాగును విస్త‌రించాడు. మ‌రో ఏడు ఎక‌రాల‌లో దీనిని వ‌చ్చే సీజ‌న్ లో పండిస్తాన‌ని తెలిపాడు.

ఈ సాగులో ముగ్గురు పురుషులు, ఒక మ‌హిళ తోడ్పాటు అందించార‌ని తెలిపాడు అతుల్ మిశ్రా. ఇత‌ర భూమిలో గోధుమ‌లు పండిచారు. ఖ‌ర్చు అధికం రాబ‌డి త‌క్కువ వ‌చ్చింద‌న్నాడు.

కానీ డ్రాగ‌న్ ఫ్రూట్ వ‌ల్ల అధిక ఆదాయం ల‌భించింద‌న్నాడు. ఇక ఫంగ‌స్ నుంచి మొక్క‌ల‌ను ర‌క్షించేందుకు గోమూత్రం, మందులు పిచికారీ చేశాన‌ని తెలిపాడు అతుల్ మిశ్రా.

బీహార్, మ‌ధ్య ప్ర‌దేశ్, హ‌ర్యానాతో పాటు అనేక రాష్ట్రాల నుండి త‌న వ‌ద్ద‌కు వచ్చే వారికి పండ్ల మొక్క‌ల‌ను విక్ర‌యిస్తున్నాడు. వారికి ఎలా పెంచాలో కూడా

చిట్కాలు కూడా చెబుతున్న‌ట్లు తెలిపాడు.

వీటిని ఢిల్లీలో విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిపాడు. మిశ్రా సాధించిన విజ‌యాన్ని రైతులు ప్ర‌శంసిస్తున్నారు. అయితే పంట సాగుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి స‌హ‌కారం లేద‌ని వాపోయారు.

ఏది ఏమైనా ఇంజ‌నీరింగ్ కంటే వ్య‌వ‌సాయమే బెట‌ర్ అంటున్న అతుల్ మిశ్రా గ్రేట్ క‌దూ.

Also Read : ప‌రివార్ లో షాజియా కామెంట్స్ ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!