Andhra Cricket Association(ACA) : ఏసీసీ ఆధ్వర్యంలో బిగ్ స్క్రిన్స్
ఏపీలో 13 నగరాలలో ఏర్పాటు
ACA : ఆంధ్రప్రదేశ్ – ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మోతేరా స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా క్రికెట్ అభిమానులకు ఖుష్ కబర్ చెప్పింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) .
ACA Plants to start Screen
రాష్ట్ర వ్యాప్తంగా 13 బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విశాఖపట్నం లోని కాళీ మాత గుడి ఎదురుగా ఆర్కే బీచ్ లో , అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో ఏర్పాటు చేసింది. ఏలూరులోని కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఇండోర్ స్టేడియం గ్రౌండ్ , గుంటూరులోని మాజేటి గురువయ్య హైస్కూల్ గ్రౌండ్ , కడప లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏసీసీ బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
వీటితో పాటు కాకినాడ లోని రంగరాయ మెడికల్ కాలేజ్ మైదానం, కర్నూల్ లోని డీఎస్ఏ స్టేడియం, నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ గ్రౌండ్ , ఒంగోలులో జెడ్పీ మినీ స్టేడియం, శ్రీకాకుళం లోని 7 రోడ్ జంక్షన్ లోని ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్ , తిరుపతి లోని కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ లో స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
Also Read : Indian Fans Prayers Comment : దేవుడా రక్షించు దేశాన్ని గెలిపించు