Pakistan Loss : జింబాబ్వేతో పాక్ ఓటమిపై ఆగ్రహం
కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో షాక్
Pakistan Loss : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పసికూనలైన నమీబియా శ్రీలంకకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మరో టైటిల్ ఫెవరేట్ గా పేరొందిన ఇంగ్లండ్ ను ఓడించింది. తాజాగా అక్టోబర్ 27న జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్ లో ఊహించని షాక్ కు గురైంది పాకిస్తాన్(Pakistan Loss).
ఊహించని రీతిలో ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది పాకిస్తాన్ జట్టు. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ప్రధానంగా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. పాకిస్తాన్ ఇప్పటికే ప్రారంభ మ్యాచ్ లో భారత జట్టు చేతిలో ఓటమి పాలైంది. దీంతో పాకిస్తాన్ అంతటా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సారథ్యంలో రెండు మ్యాచ్ లను కోల్పోవడాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు. తాజా, మాజీ పాకిస్తాన్ ఆటగాళ్లు నిప్పులు చెరిగారు. పేలవమైన ఆట తీరుతో పాకిస్తాన్ నిరాశ పర్చడాన్ని తట్టుకోలేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ట్విట్టర్ వేదికగా పాకిస్తాన్ మాజీ దిగ్గజాలు వసీం అక్రమ్ , షాహీది అఫ్రిది, షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అభిమానులు పాకిస్తాన్ జట్టును ఏకి పారేశారు. సామాజిక మాధ్యమాలలో జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజానే కారణమంటూ తెగ ట్రోలింగ్ అవుతోంది. ఈ తరుణంలో పాక్ ప్రస్తుతం రెండు మ్యాచ్ లు ఓడి పోయి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సెమీస్ కు చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read : జింబాబ్వే ప్రెసిడెంట్ పై పాక్ పీఎం ఫైర్