Anil Ambani : డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా
రిలయన్స్ పవర్..రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
Anil Ambani : వ్యాపార పరంగా పీకలలోతు కష్టాలలో కూరుకు పోయిన ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ(Anil Ambani) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రిలయన్స్ పవర్ (Reliance Power), రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్లో తాను డైరెక్టర్ గా ఉన్నారు(Reliance Infrastructure). ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ -ఏ- లిస్టెడ్ కంపెనీతోనూ కార్యకలాపాలు జరపరాదంటూ నిషేధం విధించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అనిల్ అంబానీ తప్పుకుంటున్నట్లు తెలిపారు.
కాగా సెబీ – సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిలయన్స్ పవర్ (Reliance Power)బోర్డు నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ అంబానీ (Anil Ambani) వైదొలగిరాంటూ రిలయన్స్ పవర్ బీఎస్ఇ ఫైలింగ్ లో స్పష్టం చేసింది.
సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం వల్లే వైదొలగాల్సి వచ్చిందని స్పష్టం చేసింది ఈ ఫైలింగ్ లో. అయితే ఎందుకు బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారే దానికి పెద్ద కథే ఉంది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ , పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరో ముగ్గురు వ్యక్తులను సెక్యూరిటీస మార్కెట్ నుంచి కంపెనీ నుండి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలపై గత ఫిబ్రవరిలో సెబీ నిషేధించింది.
ఇక సాధారణ సమావేశంలో సభ్యుల ఆమోదానికి లోబడి ఆర్ పవర్, ఆర్ ఇన్ ఫ్రా బోర్డులలో ఐదేళ్ల కాలానికి రాహుల్ సరిన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో అదనపు డైరెక్టర్ గా నియమించినట్లు రిలయన్స్ గ్రూప్ సంస్థలు వెల్లడించాయి.
Also Read : లావాదేవీలలో హైదరాబాద్ టాప్