Anil Kumar Yadav : అభ్య‌ర్థుల ఓట‌మికి నారాయ‌ణ డ‌బ్బులు

మాజీ మంత్రిపై అనిల్ కుమార్ యాద‌వ్

Anil Kumar Yadav : ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మొన్న ఎమ్మెల్యే ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కు ఛాలెంజ్ విసిరారు. ఇవాళ ఏకంగా మాజీ మంత్రి టీడీపీకి చెందిన నారాయ‌ణ‌పై భ‌గ్గుమ‌న్నారు.

గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు త‌న‌కు డ‌బ్బులు పంపించార‌ని ఆరోపించారు. అయితే తాను పార్టీకి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, ఆ డ‌బ్బుల‌ను తిరిగి పంపించాన‌ని తెలిపారు. ఇన్నాళ్ల పాటు ఎందుకు చెప్ప‌లేదంటే సంద‌ర్భం రాలేద‌న్నారు. ప్ర‌స్తుతం త‌మ‌పై వ్య‌క్తిగ‌తంగా టీడీపీ టార్గెట్ చేస్తూ నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డంతో తాను నోరు విప్పాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు అనిల్ కుమార్ యాద‌వ్(Anil Kumar Yadav). తాను చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని , అవ‌స‌ర‌మైతే ఎక్క‌డైనా ఏ దేవుడి పైన నైనా ప్ర‌మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

అయితే టీడీపీలో జెండాలు మోసిన వాళ్ల‌ను, క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌ను ఆ పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు మోసం చేయ‌డం మామూలేన‌ని పేర్కొన్నారు మాజీ మంత్రి. ఇందుకు సంబంధించి ప్ర‌త్య‌క్షంగా ఆయ‌న కొంద‌రు నేత‌ల‌ను కూడా ఉద‌హ‌రించారు. కోటంరెడ్డి శ్రీ‌నివాసులు రెడ్డి, అబ్దులు అజీజ్ లేరా అని ప్ర‌శ్నించారు. తాను లోకేష్ పై చేసిన ఆరోప‌ణ‌ల‌తో జిల్లా అంత‌టా టీడీపీ అల‌ర్ట్ అయ్యిందంటే త‌న స‌త్తా ఏపాటిదో తెలియ‌దా అన్నారు.

Also Read : Rahul Gandhi : శాంతి తప్ప మ‌రో మార్గం లేదు

Leave A Reply

Your Email Id will not be published!