ATF Gaddar : గద్దర్ పై ఏటీఎఫ్ కామెంట్స్
అధికారిక లాంచనాలతో చేయడం అవమానించడమే
ATF Gaddar : గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చేయాలని అనుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది యాంటి టెర్రరిజం ఫోరం (ఏటీఎఫ్) . ఇలా చేస్తే పోలీసు అమర వీరులను అగౌరవ పర్చడమేనని పేర్కొంది. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల , పౌరుల త్యాగాలను అవమానించడమే అవుతుందని స్పష్టం చేసింది.
ATF Gaddar Words
గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నన్సలైట్ ఉద్యమం వైపు మళ్లించిన వ్యక్తి అని పేర్కొంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన నక్సల్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలి తీసుకుందని ఆరోపించింది ఏటీఎఫ్.
ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు చేసేందుకు తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్(Gaddar) కు తెలంగాణ సర్కార్ అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించడం దారుణమని ఆరోపించింది.
పోలీసులను, వారి త్యాగాలను, బలిదానాలను అవమానించడమేనని వాపోయింది ఏటీఎఫ్. ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని , ప్రతి ఒక్కరు ఖండించాలని కోరింది. పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పాలని కోరింది.
Also Read : Gaddar Singer : పోటెత్తిన పాట చైతన్యానికి ప్రతీక