Anurag Thakur : విచారణ అయ్యేంత దాకా అన్నీ బంద్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
Anurag Thakur : భారత రెజ్లర్ సమాఖ్య చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించాలని కోరుతూ మహిళా రెజ్లర్లు 30 మందికి పైగా ఆందోళన చేపట్టడంపై ఇంకా చర్చ కొనసాగుతోంది. వారి నిరసన వెనుక రహస్య ఎజెండా ఉందంటూ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని భారత రెజర్ల సమాఖ్య కేంద్రానికి పూర్తి నివేదిక ఇచ్చింది.
72 గంటల సమయం ఇచ్చినా స్పందించ లేదు. ఇదే విషయంపై మహిళా రెజ్లర్లు భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉషకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఐవోసీ కీలక మీటింగ్ ఏర్పాటు చేసింది. మేరీకోమ్ అధ్యక్షతన ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా విచారణ పూర్తయ్యేంత వరకు అన్ని కార్యకలాపాలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఆదివారం ఆయన కోల్ కతాలో మీడియాతో మాట్లాడారు. పూర్తి నివేదిక వచ్చేంత వరకు అన్నింటిని నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో డబ్లుఎఫ్ఐ కార్యదర్శి వినోద్ తోమర్ ను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు ఠాకూర్(Anurag Thakur) చెప్పారు.
డబ్ల్యూఎఫ్ఐపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆటగాళ్లందరి ఆవేదనను కేంద్రం విన్నది. ఒక టోర్నీని తక్షణమే నిలిపి వేశాం. అదనపు కార్యదర్శిని తొలగించాం. పర్యవేక్షణ కమిటీ నిష్పాక్షికంగా విచారణను ప్రారంభిస్తుందన్నారు.
ఇదిలా ఉండగా వినేష్ ఫోగట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు.
Also Read : శుభ్ మన్ గిల్ ఆట అద్భుతం