Anurag Thakur : జోడో యాత్ర సరే రాజస్థాన్ మాటేంటి
రాహుల్ గాంధీపై అనురాగ్ ఠాకూర్ సెటైర్
Anurag Thakur : కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒక ప్రహసనంగా మారిందన్నారు.
134 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానిని పరిష్కరించ లేక చేతులెత్తేసిందంటూ ధ్వజమెత్తారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).
పదే పదే బీజేపీపై కామెంట్స్ చేసే రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకరిపై రాళ్లు విసిరే ముందు తమ వైపు చూసుకోవాలని హితవు పలికారు.
అనురాగ్ ఠాకూర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తుంటే వారు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు ఈపాటికే అర్థమై పోయిందన్నారు.
ప్రజలు తమ కోసం ఎన్నుకుంటే వీరు ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సీఎం అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్ ల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు రాష్ట్రంలో సంక్షోభం నెలకొనేలా దారి తీసిందన్నారు.
దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల కంటే పదవులే, అధికారమే ముఖ్యమని దీని ద్వారా స్పష్టంగా అర్థమైందని చెప్పారు అనురాగ్ ఠాకూర్. ఒక రకంగా ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే వినోదంలా అగుపిస్తోందని పేర్కొన్నారు.
ఇకనైనా రాహుల్ గాంధీ యాత్ర బంద్ చేసి ముందు తన పార్టీని చక్కదిద్దుకుంటే బెటర్ అని సలహా ఇచ్చారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
Also Read : గెలవాలంటే పోరాటం చేయాలి – శశి థరూర్