AP 10th Inter Exam : ఏపీలో 10, ఇంటర్ పరీక్షల షెడ్యూల్
వెల్లడించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
AP 10th Inter Exam : అమరావతి – ఏపీ వైద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. వచ్చే మార్చి నెలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముందస్తుగా షెడ్యూల్ ప్రకటించడంతో విద్యార్థులకు అనువుగా ఉంటుందన్నారు.
AP 10th Inter Exam Schedule
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. మార్చి 18 నుంచి 31 వరకు 10వ తరగతి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు బొత్స సత్యనారాయణ. 12 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 నిమిషాలకు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు బొత్స సత్యనారాయణ.
ఇదిలా ఉండగా ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయని, దీంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకే ఈ తేదీలలో పరీక్షలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొత్తంగా ఏపీలో(AP) షెడ్యూల్ ఖరారు కావడంతో విద్యార్థులు పరీక్షలపై ఫోకస్ పెట్టాలన్నారు.
Also Read : Telangana Cabinet : గవర్నర్ ప్రసంగానికి ఆమోదం