AP CID Investigation : చంద్రబాబు సీఐడీ విచారణ షురూ
రెండు రోజుల సీఐడీ ఇన్వెస్టిగేషన్
AP CID Investigation : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుకు సంబంధించి విచారించిన ఏసీబీ కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ తీర్పు చెప్పింది.
AP CID Investigation Started
దీంతో శనివారం, ఆదివారం సీఐడీ తన కస్టడీలోకి తీసుకోనుంది నారా చంద్రబాబు నాయుడును. వయసు, ఆరోగ్య దృష్ట్యా ఆయనను రాజమండ్రి జైలు లోనే విచారిస్తోంది . కేసు దర్యాప్తు అధికారి, సీఐడీ డీఎస్పీ ధనుంజయ నేతృత్వంలో చంద్రబాబును విచారిస్తోంది. విచారణలో 9 మంది సీఐడీ అధికారులతో పాటు సిబ్బంది, ఇద్దరు మధ్యవర్తులు, ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు.
శనివారం ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు నాయుడును(Chandrababu Naidu) ఏపీ సీఐడీ విచారిస్తోంది. సాయంత్రం 5 గంటల దాకా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా చంద్రబాబు తరపున ఒక న్యాయవాదికే పర్మిషన్ ఉంది. అయితే సీఐడీ విచారిస్తున్న సమయంలో చంద్రబాబు వద్ద ఎవరూ ఉండ కూడాదని స్పష్టం చేసింది కోర్టు.
విచారణ మధ్యలో ప్రతీ గంటకి 5 నిమిషాల పాటు తన న్యాయవాదితో మాట్లాడేందుకు చంద్రబాబు నాయుడుకు అనుమతి ఇచ్చింది. అవసరమైన మందులు ఇవ్వడం, లంచ్ బ్రేక్ కు అనుమతి కూడా ఇచ్చింది.
Also Read : TS Digital Media : తెలంగాణ డిజిటల్ మీడియాకు అవార్డు