AP CID Notice : టీడీపీకి షాక్ సీఐడీ నోటీస్

18 లోపు అకౌంట్ వివ‌రాలు ఇవ్వాలి

AP CID Notice : అమ‌రావ‌తి – రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న తెలుగుదేశం పార్టీకి, అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. మంగ‌ళ‌వారం కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ. టీడీపికి సంబంధించిన అకౌంట్ వివ‌రాల‌ను పూర్తిగా ఇవ్వాల‌ని కోరింది. ఈ మేర‌కు డెడ్ లైన్ కూడా ఖ‌రారు చేసింది. ఇందులో భాగంగా ఈనెల 18 లోపు ఎవ‌రెవ‌రి నుంచి డ‌బ్బులు విరాళాల రూపేణా వ‌చ్చాయో తెలియ చేయాల‌ని ఆదేశించింది.

AP CID Notice to TDP

పార్టీ ఆఫీసులో ఏపీ సీఐడీ నోటీసులు అంద‌జేసింది. మ‌రో వైపు డ‌బ్బులు హ‌వాలా రూపంలో పార్టీకి విరాళాల రూపేణా వ‌చ్చిన‌ట్లు అనుమానిస్తోంది ఏపీ ద‌ర్యాప్తు సంస్థ‌. ఇదే స‌మ‌యంలో నారా చంద్ర‌బాబు నాయుడుపై ప‌లు కేసులు న‌మోదు చేసింది. ఇప్ప‌టికే ఆయ‌న ఏపీ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

అనారోగ్యం పేరుతో బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయినా ప‌లు కేసులు న‌మోదు చేసింది ఏపీ సీఐడీ(AP CID). ఎక్క‌డా ఊపిరి పీల్చుకోనీయ‌డం లేదు. ఏపీ స‌ర్కార్ కావాల‌ని త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ ఆరోపించింది టీడీపీ . ఇది పూర్తిగా క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొంది. జ‌నం అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

Also Read : Eatala Rajender : క‌మ‌లం విజ‌యం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!