CM YS Jagan : రైలు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం
CM YS Jagan : ఒడిశా లోని బాలాసోర్ లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో 237 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారత దేశ చరిత్రలో ఇదే అతి పెద్ద ప్రమాదంగా నిలిచింది. పీఎం నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూనే తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం.
ఇదిలా ఉండగా మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారా లేదా అన్న దానిపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా రైల్వే అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నామని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రైల్వే అధికారుల నుంచి నిరంతరం సమాచారం తెప్పించు కోవాలని సూచించారు.
Also Read : JP Nadda