AP CM YS Jagan : శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాల సమర్పణ
తిరుమలలో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
AP CM YS Jagan :తిరుమల – పుణ్య క్షేత్రమైన తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
AP CM YS Jagan Visit Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి సాదర స్వాగతం పలికారు. సీఎం ముందుగా ధ్వజ స్తంభానికి నమస్కరించారు. వకుళమాత, విమాన వేంకటేశ్వర స్వామి, భాష్యకర్త సన్నిధి, యోగ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణతో వేద పండితులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఏవో ధర్మా రెడ్డి సీఎంకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామి కళంకారీ చిత్ర పటాన్ని బహూకరించారు.
Also Read : Tamil Directors Comment : వెండి తెరపై దర్శకులే హీరోలు