AP CM YS Jagan : ఆరోగ్య సురక్ష శ్రీరామ రక్ష – జగన్
స్పష్టం చేసిన ఏపీ సీఎం
AP CM YS Jagan : తాడేపల్లి గూడెం – రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరికీ శ్రీరామ రక్షగా ఉంటుందని స్పష్టం చేశారు. క్యాంపు ఆఫీసులో సమీక్ష చేపట్టారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు , ఎమ్మెల్సీలతో ముచ్చటించారు.
AP CM YS Jagan Comment on Arogya Raksha
ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా నెల రోజుల పాటు చర్చించాలని స్పష్టం చేశారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఇక గేర్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ని రోజుల పాటు మనం చేసిన ప్రచారం, గడప గడపకు కార్యక్రమాలు ఒక ఎత్తు. అసెంబ్లీ ముగిశాక చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తీరు ఇంకొక ఎత్తు అని పేర్కొన్నారు.
ఇన్ని రోజులు కష్ట పడ్డామని ఊరుకుంటే లాభం లేదన్నారు. వచ్చే ఆరు నెలలు ఎలా పని చేశామన్న దానిపైనే మన ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. ఇది మనసులో పెట్టుకుని ప్రతి అడుగు ముందుకు వేయాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలలో వైసీపీ జెండా ఎగురాలని స్పష్టం చేశారు జగన్ రెడ్డి. ప్రతి ఒక్కరు స్థానికంగా ఉండాలని పేర్కొన్నారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా తాను ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఇక జగనన్న సురక్షను మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : AP Students : ఏపీ విద్యార్థులు భేష్ – వరల్డ్ బ్యాంకు