AP CM YS Jagan : పోలీసు అమరులకు వందనం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan : విజయవాడ – ప్రజలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సీఎం. ఈ సందర్బంగా గౌరవ వందనం స్వీకరించారు.
AP CM YS Jagan Praises AP Police
పోలీస్ అమర పోలీసు వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇవాళ విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు అని పేర్కొన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవాన్ని జరుపు కోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు జగన్ రెడ్డి.
1959 అక్టోబరు 21 న చైనా సైనికులను ఎదురించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఆమర వీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాం. గడిచిన సంవత్సర కాలంలో ఇలా దేశ వ్యాప్తంగా అమరులైన 188 పోలీసులు అందరికీ నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని స్పష్టం చేశారు ఏపీ సీఎం.
రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సోదరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా, తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగ నిరతి. ఆ డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలు మన దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం.
పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు. అంతకు మించి ఒక బాధ్యత కూడా. ఈ ఉద్యోగం ఒక సవాల్. మరీ ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకు మించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు విలువ ఉంటుందన్నారు జగన్ రెడ్డి.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ