AP Comment : ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనా
జోరు మీదున్న వైసీపీ..జోగుతున్న టీడీపీ
AP Comment : వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది ఉమ్మడి ఏపీ విషయంలో. తెలంగాణ పోరాట ఫలితంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏపీ విభజనకు(AP Comment) ఒప్పుకుంది.
ఇదే సమయంలో అటు ఏపీలో ఇటు తెలంగాణలో పార్టీ పవర్ లోకి వస్తుందని ఆశించింది. కానీ ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఏపీలో వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు 40 ఏళ్ల రాజకీయ అనుభం కలిగిన టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది.
ఇక గణనీయమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. పార్టీకి సంబంధించి ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నప్పటికీ బలోపేతం చేయడంలో ఫోకస్ పెట్టలేక పోయారు.
దీంతో పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా ఇతర పార్టీలకు మళ్లి పోయారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలంతా వైసీపీ వైపు మొగ్గారు.
తాను నమ్ముకుంటూ వచ్చిన మైనార్టీలు, క్రిష్టియన్లు, ఇతర వర్గాల వారంతా ఇప్పుడు జగన్ రెడ్డికి గంప గుత్తగా మళ్లి పోయారు. వ్యూహాలు పన్నడంలో తనకు తానే సాటి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సైతం దిక్కు తోచని స్థితిలో పడి పోయాడు.
రోజు రోజుకు జగన్ రెడ్డి మరింత బలంగా తయారై దూసుకు వెళుతున్నాడు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచుతుంటే ఏపీలో మాత్రం పార్టీ ఊసే లేకుండా పోయింది. గతంలో తులసీరెడ్డి, రఘువీరారెడ్డి ఉన్నప్పుడు కాస్తో కూస్తో పేరుండేది.
ప్రస్తుతం శైలజానాథ్ కు పగ్గాలు అప్పగించింది. ఇకనైనా పార్టీ చీఫ్ శ్రద్ద పెడితే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read : ఉద్దవ్ ఠాక్రే నోట పుష్ప డైలాగ్