Kanna Lakshminarayana : ‘కన్నా’కు గన్ మెన్లు తొలగింపు
మాజీ మంత్రికి బిగ్ షాక్
Kanna Lakshminarayana : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు. ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేశారు. గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ గా ఉన్నారు. ఎందుకనో అక్కడ ఉండలేక పోయారు. కమలానికి గుడ్ బై చెప్పేసి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Kanna Lakshminarayana Said
సెక్యూరిటీ పరంగా రాష్ట్ర సర్కార్ గన్ మెన్లను ఏర్పాటు చేసింది. గత ఐదు సంవత్సరాలుగా రక్షణగా ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణకు అంగరక్షకులు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి మూడు రోజులుగా గన్ మెన్ల జాడ లేక పోవడంతో కన్నా అవాక్కయ్యారు. ఆ వెంటనే తేరుకున్నారు. తనకు ఎందుకు తొలగించాల్సి వచ్చిందోనని ఆరా తీశారు.
తీరా చూస్తే సర్కార్ ఉపసంహరించు కుందని తేలింది. కాగా తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాకు చెందిన ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఒత్తిడి మేరకే కన్నాకు ఉన్న గన్ మెన్లను తొలగించారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read : Asleshah Edala : వెలుగులు పంచుతున్న ‘ ఆశ్లేష’