Asleshah Edala : వెలుగులు పంచుతున్న ‘ ఆశ్లేష’

మిత్రా వాక్ సంస్థ‌తో నిరంత‌ర శిక్ష‌ణ

Asleshah Edala : నిరంత‌ర శిక్ష‌ణ, అవ‌గాహ‌న, సంపూర్ణ స‌హ‌కారం మెరుగైన మాన‌వ జీవితానికి దోహ‌ద ప‌డ‌తాయ‌ని అంటారు ప్ర‌ముఖ సైకాల‌జిస్ట్ , ట్రైన‌ర్ డాక్ట‌ర్ ఆశ్లేష ఎడ‌ల. మిత్రా వాక్ సంస్థ‌కు ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారిగా ఉన్నారు. వేలాది మందికి శిక్ష‌ణ‌తో స్వాంత‌న క‌లిగిస్తున్నారు. విద్యాధికురాలిగా పేరు పొందారు అస్లేషా ఎడ‌ల‌(Asleshah Edala). స‌మాజం ప‌ట్ల ప్రేమ‌, సాటి మ‌నుషుల ప‌ట్ల క‌రుణ క‌లిగి ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటారు డాక్ట‌ర్. ఇందు కోసం ఆమె మిత్రా వాక్ పేరుతో ఓ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంద‌రికో శిక్ష‌ణ ఇస్తూ వ‌స్తున్నారు. ప్ర‌తిభా ఎడ్యుకేర్ అండ్ జూనియ‌ర్ కాలేజీ డీఏఎన్ గా ప‌ని చేశారు. గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాల‌యంలో గ‌తంలో అతిథి అధ్యాప‌కురాలిగా ఉన్నారు. జీఎస్ మెంటార్స్ లో స‌బ్జెక్ట్ అసోసియేట్ గా సేవ‌లు అందించారు.

Asleshah Edala Words

ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ లో డాక్ట‌రేట్ పొందారు నాగార్జున యూనివ‌ర్శిటీ నుంచి. ఢిల్లీలోని ఇగ్నోలో ఎంపీఎలో మాస్ట‌ర్స్ చ‌దివారు. రాజ మ‌హేంద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ (రీట్ )లో ఇంజ‌నీరింగ్ పూర్తి చేశారు. త‌న‌కు మొదటి నుంచి మ‌న‌స్త‌త్వ శాస్త్రం అంటే ఇష్టం . దీంతో ఆదిక‌వి న‌న్న‌య విశ్వ విద్యాల‌యంలో సైకాల‌జీలో మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చ‌దివారు. ఆమె స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాజ‌మ‌హేంద్రవ‌రం. విద్యాధికురాలిగా ఎంతో అనుభ‌వం గ‌డించిన డాక్ట‌ర్ ఆశ్లేష ఎడ‌ల శిక్ష‌కురాలిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. కెరీర్ ఎలా ఎంచుకోవాలి, ఒత్తిళ్ల నుంచి ఎలా గ‌ట్టెక్కాలి, ప్ర‌శాంత‌త‌ను ఎలా పొందాలి, సంతోషాన్ని ఎలా క‌లిగి ఉండాల‌నే దానిపై ట్రైనింగ్ ఇస్తారు.

విద్య ద్వారా వికాసం క‌లుగుతుంద‌ని, శిక్ష‌ణ ద్వారా మ‌రింత మెరుగైన లైఫ్ పొంద‌వ‌చ్చ‌ని సూచిస్తారు డాక్ట‌ర్. ఇంట‌ర్నేష‌న‌ల్ స‌ర్టిఫైడ్ కెరీర్ కోచ్ , నేష‌న‌ల్ ట్రైన‌ర్ గా ప‌ని చేసిన అనుభ‌వం ఆశ్లేష ఎడ‌ల కు మ‌రింత గుర్తింపు తెచ్చేలా చేసింది. వ్య‌క్తులే కాకుండా సంస్థ‌లు, పేరొందిన కంపెనీలు, విద్యా సంస్థ‌లలో శిక్ష‌ణ ఇస్తూ వ‌స్తున్నారు. మిత్రా వాక్ జీవిత నైపుణ్యాల శిక్ష‌ణ‌, అభివృద్దిలో ప్ర‌స్తుతం అగ్ర‌గామి సంస్థ‌గా తీర్చిదిద్దారు డాక్ట‌ర్. 100కు పైగా వ్య‌క్తిత్వ వికాస శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. ల‌క్ష మందికి పైగా విద్యార్థుల‌ను వ‌క్తలుగా, విజేత‌లుగా త‌యారు చేయాల‌న్న‌ది ఆమె సంక‌ల్పం. డాక్ట‌ర్ ఆశ్లేష రాబోయే రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆశిద్దాం.

Also Read : Gudivada Amarnath : ప‌వ‌న్ జ‌ర నోరు జాగ్ర‌త్త – అమ‌ర్నాథ్

Leave A Reply

Your Email Id will not be published!