Tiger-3 Movie : ఆగ‌స్టు 15న స‌ల్మాన్ టైగ‌ర్ -3 టీజ‌ర్

న‌వంబ‌ర్ 10న సినిమా విడుద‌ల

Tiger-3 Movie : బాలీవుడ్ లో కింగ్ మేక‌ర్ గా పేరు పొందిన స‌ల్మాన్ ఖాన్ న‌టించిన టైగ‌ర్ -3 మూవీకి సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది. వ‌చ్చే ఆగ‌స్టు 15న క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ 7న మూవీ టీజ‌ర్ , సెప్టెంబ‌ర్ 28న చిత్రం ట్రైల‌ర్ -1 , అక్టోబ‌ర్ 6న సాంగ్ -1 , 16న సాంగ్ -2 , అక్టోబ‌ర్ 25న టైగ‌ర్ -3 ట్రైల‌ర్ -2ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Tiger-3 Movie Release Date

దీంతో మూవీ ప్ర‌మోష‌న్స్ కు సంబంధించి షెడ్యూల్ ఖ‌రారు చేశారు మూవీ మేక‌ర్స్. న‌వంబ‌ర్ 7 నుండి 9 వ‌ర‌కు సినిమా ప్రోమో ఉంటుంద‌న్నారు. ఇక చిత్రం రిలీజ్ డేట్ ను కూడా ఖ‌రారు చేశారు. న‌వంబ‌ర్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా టైగ‌ర్ -3(Tiger-3) విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇక స‌ల్మాన్ ఖాన్ చిత్రానికి మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ‌ధ‌ర్ రాఘ‌వ‌న్ రాశారు. ఆదిత్యా చోప్రా క‌థ స‌మ‌కూర్చారు. ఆయ‌నే నిర్మించారు. ఈ మూవీలో స‌ల్మాన్ ఖాన్ తో పాటు క‌త్రినా ఖైఫ్ న‌టిస్తున్నారు. మిగ‌తా పాత్రలో ఇమ్రాన్ హ‌ష్మీ కూడా న‌టించ‌గా అన‌య్ గోస్వామి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. స్కోర్ సంగీతం అందించ‌గా ప్రీత‌మ్ పాట‌లు రాశారు. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేయ‌నున్నారు. మొత్తంగా స‌ల్మాన్ ఖాన్ చిత్రం కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

Also Read : Tirumala Rush : పుణ్య క్షేత్రానికి పోటెత్తిన భక్తులు రూ. 4.20 కోట్లు ఆదాయం

 

Leave A Reply

Your Email Id will not be published!