AP Politics Comment : ఏపీలో రాజకీయం రసకందాయం
నాలుగు స్తంభాలటలో విజేత ఎవరో
AP Politics Comment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరింత రంజుగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుందని అనుకున్నా ప్రస్తుతానికి సందింటి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైస్సార్సీపీనే పై చేయిగా ఉంది. సంక్షేమ పథకాల అమలు చేయడంలో ముందంజలో కొనసాగుతోంది.
ఇదే సమయంలో కోట్లాది రూపాయలు అప్పులు తీసుకు వచ్చి ప్రజలపై గుదిబండగా మార్చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన , కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు బరిలో ఉండనున్నాయి.
రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేయడం మొదలు పెట్టారు జగన్ రెడ్డి. ఆయన ప్రక్షాళన చేయడంలో నిమగ్నం అయ్యారు. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గానికి బాధ్యులను నియమించారు.
పార్టీ అధ్యక్షులతో పాటు ప్రాంతీయ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఒక్క సీటు ప్రతిపక్షాలకు పోకూడదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు జగన్.
ఇదే సమయంలో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసేందుకు(AP Politics) రెడీ అయ్యాయి. మరో వైపు టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉంది. మరో
వైపు రాష్ట్రంలో చాపకింద నీరులా అల్లుకు పోయింది వైసీపీ. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చేందుకు విపక్షాలు వ్యూహాలు పన్నడంలో నిమగ్నమయ్యాయి.
మరో వైపు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ రెడ్డిని, వైసీపీ సర్కార్ ను ఏకి పారేస్తున్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తమ వైపు ఉన్నారని వైసీపీ భావిస్తోంది. తాము అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలే రక్షిస్తాయని నమ్మకంతో ఉన్నారు జగన్ రెడ్డి. కానీ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే భావనతో ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
వ్యూహాలు, ప్రతివ్యూహాలలో నిమగ్నమయ్యారు. మరో వైపు జనసేనాని ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఈసారి తన సత్తా ఏమిటో చూపించాలని డిసైడ్
అయ్యారు. అడపా దడపా జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఆయనది బలుపు తప్ప వాపు కాదంటోంది వైసీపీ.
ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. ఇదే సమయంలో పవర్ స్టార్ తో కలిసి ముందుకు వెళతామని ప్రకటించింది బీజేపీ.
ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ కావడం(AP Politics) ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత పీఎంతో చర్చించడం చర్చకు దారితీసింది.
ఓ వైపు బాబు తన రాజకీయ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని పావులు కదపడంలో ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
టీడీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, అభివృద్ది ఏమిటో చూపిస్తానని ఇదే నా జీవితంలో ఆఖరి ఎన్నికలు అని ప్రకటించడం విస్తు పోయేలా చేశాయి. జగన్ బలమే వైసీపీకి శ్రీరామ రక్ష కాగా చంద్రబాబు అనుభవం టీడీపీకి ప్లస్ పాయింట్ కానుంది.
ఇక కేంద్రంలోని బీజేపీ , పవర్ స్టార్ చరిష్మా, రాహుల్ గాంధీ పాదయాత్ర ఏ మేరకు ఓట్లు రాబడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా ఏపీలో
రాజకీయం నాలుగు స్తంభాలాటగా మారింది. రసకందాయానికి చేరింది.
Also Read : గ్రూప్స్ లో మరిన్ని పోస్టులకు సర్కార్ ఓకే