APCC Chief YS Sharmila: టీడీపీ, వైసీపీలు కేంద్రంలోని బిజేపీకు అమ్ముడుపోయాయి- ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

టీడీపీ, వైసీపీలు కేంద్రంలోని బిజేపీకు అమ్ముడుపోయాయి- ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

APCC Chief YS Sharmila: గత పదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీలు… ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేంద్రంలో ఉన్న బిజేపీ వద్ద తాకట్టు పెట్టాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. టీడీపీ(TDP) అధికారంలో ఉన్నప్పుడు బిజేపీతో ఉన్న పొత్తుతో కేంద్ర మంత్రి పదవులు పొంది… ప్రత్యేక హోదాను ప్రక్కన పెట్టారని. ఆమె తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం అనేక ఉద్యమాలు చేసిన వైఎస్ జగన్… అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసారా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కాదు కనీసం ప్యాకేజీ అయినా ఈ రెండు పార్టీలు తీసుకువచ్చాయా అని ప్రశ్నించారు. కాబట్టి టీడీపీ, వైసీపీలు తమ స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు.

APCC Chief YS Sharmila Comment

మూడు రాజధానులు కడతానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్… ఒక్క రాజధాని అయినా కట్టారా అని ఎద్దేవా చేసారు. సింగపూర్ అంటూ త్రీడీ గ్రాఫిక్స్ తో చంద్రబాబు కాలయాపన చేస్తే… మూడు రాజధానులతో జగన్ ఆంద్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేరాన్నారు. బిజేపీతో దోస్తీ కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు, జగన్ ఇద్దరూ తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రంలో మైనింగ్, ఇసుక మాఫియా రెచ్చిపోతుందని… దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆమె ఆరోపించారు. మణిపూర్ లో ఆదివాసీలు, దళిత క్రిస్టియన్లపై దాడులు జరిగితే… వైసీపీ(YCP) నాయకులు, జగన్ రెడ్డి కనీసం బిజేపీను ప్రశ్నించలేకపోయారని ఆమె మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పులు చేస్తే… ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు అప్పు చేసిందని… మొత్తంగా ఏపీ అప్పు పది లక్షల కోట్లకు చేరిందన్నారు. అయితే అభివృద్ది ఏమీ చేయలేదని ఆమె ఆరోపించారు.

ఆదివారం విజయవాడలో ఏపీసీసీ అధ్యకురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ర్యాలీగా బయలుదేరిన వైఎస్ షర్మిల(YS Sharmila), కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఆమె రోడ్డుపైనే వాహనంలోనే ఉండి సుమారు రెండు గంటల పాటు నిరసన తెలిపారు. విజయవాడ ఏమైనా పాకిస్తాన్ బోర్డరా ? వైసీపీ ప్రభుత్వం భయపడుతుందా ? అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సహా పలువురు నాయకులు షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు సార్లు పీసీసీ అధ్యకులుగా, ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి పనిచేసారని… ఆయన ఆశయాలతో నేను కూడా పనిచేస్తాన్నారు. రాహుల్ గాంధీను ప్రధాని మంత్రి చేయాలన్న వైఎస్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేసారు. ఈ నెల 23 నుండి రాష్ట్రా వ్యాప్తంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృష్టి చేస్తమాన్నారు.

Also Read : Konathala Ramakrishna: జనసేనలోని మాజీ మంత్రి కొణతాల ! సాదర స్వాగతం పలికి పవన్ కళ్యాణ్ !

Leave A Reply

Your Email Id will not be published!