Appalayagunta : వైభవోపేతం శ్రీనివాసుడి బ్రహ్మోత్సవం
అప్పలాయగుంటలో భక్తులకు దర్శనం
Appalayagunta : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి(Swami) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జూన్ 8న గురువారంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటి వరకు భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించాడు. భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఉదయం 6.25 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి(Swami) రథారోహణం చేశారు. 7.24 నుండి 9 గంటల వరకు స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులకు దర్శనం కలిగించారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ది సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మ నాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగేది తత్వ జ్ఞానం ఇదే.
అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మ వార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
Also Read : Deve Gowda Lauds : రైల్వే మంత్రి పని తీరు భేష్ – దేవె గౌడ
