Apple BKC Store : జిగేల్ మంటున్న యాపిల్ స్టోర్

ఈ నెల‌లోనే ప్రారంభానికి సిద్దం

Apple BKC Store : ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అమ్ముడు పోయే ఏకైక మొబైల్ కంపెనీ యాపిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొట్టి మొద‌టి సారిగా యాపిల్ కంపెనీ త‌న రిటైల్ స్టోర్ ల‌ను భార‌త దేశంలో ప్రారంభించ‌నుంది. ఈ మేర‌కు సంస్థ సిఇఓ టిమ్ కుక్ ప్ర‌ధాన‌మంత్రితో భేటీ కానున్నారు. ఆయ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఆర్థిక రాజ‌ధానిలో ఏర్పాటు చేసిన యాపిల్ స్టోర్ల‌ను ప్రారంభిచ‌నున్నారు.

దీంతో మిగ‌తా కంపెనీల కంటే భిన్నంగా ఉంటుంది యాపిల్. అది ఏ ప్రొడ‌క్ట్ తీసుకు వ‌చ్చినా ప్ర‌త్యేక‌త క‌లిగి ఉంటుంది. అందుకే వ‌ర‌ల్డ్ వైడ్ గా యాపిల్ వ‌స్తువుల‌కు , ఉత్ప‌త్తుల‌కు విప‌రీత‌మైన డిమాండ్.

ప్ర‌స్తుతం యాపిల్ స్టోర్స్ కు(Apple BKC Store) సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. గాజుతో త‌యారు చేసిన డోర్స్ , క‌ల‌ప‌తో త‌యారు చేసిన టైల్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. బీకేసీ స్టోర్ ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తి, స‌మ‌ర్థ‌వంతమైన యాపిల్ స్టోర్ స్థానాల్లో ఒక‌టిగా రూపొందించిన‌ట్లు స‌మాచారం. ఈ స్టోర్ లో ప్ర‌త్యేక‌త ఏమిటంటే 20 కంటే ఎక్కువ భాష‌లు మాట్లాడే 100 మంది ఉద్యోగులు ఉంటారు.

ఈనెల 18న ముంబైలో ,20న ఢిల్లీలో రెండో అవుట్ లెట్ ను ప్రారంభించ‌నుంది. యాపిల్ భార‌త దేశంలో 25 ఏళ్ల‌కు పైగా జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా స్టోర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు కంపెనీ తెలిపింది. ఇక ఇండియ‌లో యాపిల్ అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. వృద్ది రేటు 4 శాతానికి పైగా ఉన్న‌ట్లు స‌మాచారం.

Also Read : అహ్మ‌దాబాద్ లో శాంస‌న్ ఫీవ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!