Sanju Samson Fever : అహ్మ‌దాబాద్ లో శాంస‌న్ ఫీవ‌ర్

గుజ‌రాత్ కు స్కిప్ప‌ర్ బిగ్ షాక్

Sanju Samson Fever : కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ స్టేడియంలో శాంస‌న్ పేరు మార్మోమ్రోగింది. కేవ‌లం 32 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ స్టార్ క్రికెట‌ర్ 3 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 60 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. త‌న జ‌ట్టు గెలుపులో కీల‌కంగా మారాడు. ఓ వైపు 26 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన శాంస‌న్ అత్యంత బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ తో క‌లిసి స్కోర్ ను ముందుకు తీసుకు వెళ్లాడు. ఒకానొక ద‌శ‌లో గుజ‌రాత్ దే పై చేయిగా మారింది. కానీ శాంస‌న్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. త‌ల వంచ‌లేదు. ఆఫ్గ‌నిస్తాన్ స్టార్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ కు చుక్క‌లు చూపించాడు. మ్యాచ్ లో భాగంగా 13వ ఓవ‌ర్ లో వ‌రుస‌గా మూడు భారీ సిక్స‌ర్ల‌తో దుమ్ము రేపాడు. దీంతో అప్ప‌టి దాకా వికెట్లు తీసిన సంతోషం ఒక్క‌సారిగా ఆవిరై పోయింది.

మ‌రో వైపు మామూలుగా ఓట‌మిని ఒప్పుకోని పాండ్యా సంజూ శాంస‌న్(Sanju Samson Fever) వైపు సీరియ‌స్ గా చూడడం విస్తు పోయేలా చేసింది. సంజూ శాంస‌న్ చాలా కూల్ గా ఉంటాడు. ఒక ర‌కంగా ధోనీని త‌ల‌పింప చేస్తాడు. ఎవ‌రినీ ప‌ల్లెత్తు మాట అన‌డు. మాట్లాడ‌డు కానీ త‌న ప‌నిత‌నం ఏమిటి అనేది చేత‌ల్లో చూపిస్తాడు. కెప్టెన్ గా 100 మార్కులు కొట్టేశాడు.

అహ్మ‌దాబాద్ లో రాజ‌స్థాన్ మ్యాచ్ గెలిచినా ఫ్యాన్స్ మాత్రం త‌మ‌కు నిజ‌మైన హీరో సంజూనే అంటున్నారు.

Also Read : సంజూ శాంస‌న్ అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!