Sanju Samson Record : సంజూ శాంస‌న్ అరుదైన రికార్డ్

3,000 ర‌న్స్ చేసిన తొలి ఆర్ఆర్ ప్లేయ‌ర్

Sanju Samson Record : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 32 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 60 ప‌రుగులు చేశాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో 3000 ర‌న్స్ చేసిన తొలి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్ గా సంజూ శాంస‌న్ నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 3000 పరుగులు చేసిన తొలి రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌గా సంజూ శాంసన్(Sanju Samson Record) నిలిచాడు. రాజ‌స్థాన్ జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా ఉన్న శాంస‌న్ త‌న 115వ కైపీఎల్ ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ లో సంజూ ప్ర‌యాణం 2013లో క‌ల్ క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌పున అరంగేట్రం చేశాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో చేరాక స్థిర‌మైన క్రికెట‌ర్ గా కంటిన్యూ అవుతూ వ‌చ్చాడు. అనుకోని రీతిలో స్టీవ్ స్మిత్ స్థానంలో కెప్టెన్ గా ఎంపిక‌య్యాడు సంజూ శాంస‌న్. గ‌త ఏడాది ఐపీఎల్ లో త‌న జ‌ట్టును ఫైన‌ల్ దాకా తీసుకు వెళ్లాడు. ఈసారి ఎలాగైనా స‌రే క‌ప్పు ఎగ‌రేసుకు పోవాల‌ని డిసైడ్ అయ్యాడు సంజూ శాంస‌న్.

Also Read : బీసీసీఐపై హ‌ర్ష భోగ్లే షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!