Tim Cook : ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన యాపిల్ మొబైల్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) టిమ్ కుక్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం భారత్ లో మొదటిసారిగా యాపిల్ కంపెనీ తమ స్టోర్లను ఏర్పాటు చేసింది. ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో , రెండోది ముంబై లోని బాంద్రా కుర్లాన్ కాంప్లెక్స్ లో. ముంబై స్టోర్ ను యాపిల్ సిఇఓ టిమ్ కుక్(Tim Cook) ప్రారంభించారు. అంతకు ముందు ఆయన ముంబైలోని రెస్టారెంట్ లో భారతీయ వంటకాలను రుచి చూశారు.
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ నేనే టిమ్ కుక్ తో కలిసి టేస్ట్ చేశారు. యాపిల్ సిఇఓకు ప్రసిద్ది చెందిన భారతీయ వంటకం వడ పావ్ ను పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాను వడ పావ్ ను మరిచి పోలేనంటూ కితాబు ఇచ్చారు టిమ్ కుక్.
అనంతరం ముంబై స్టోర్ కు యాపిల్ ఫోన్స్ అభిమానులు పోటెత్తారు. టిమ్ కుక్(Tim Cook) కస్టమర్లను ఆహ్వానించారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దారు యాపిల్ స్టోర్ ను. ఇక గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన యాపిల్ స్టోర్ ను ప్రారంభించనున్నారు. ముంబై స్టోర్ ను ప్రారంభించిన అనంతరం టిమ్ కుక్ మాట్లాడారు. యాపిల్ కంపెనీ భారత్ కు రావడం వల్ల వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
Also Read : అక్షతా మూర్తికి రూ. 500 కోట్ల నష్టం