AR Rahman Saira : హిందీ వద్దు తమిళం ముద్దు – రెహమాన్
దిగ్గజ సంగీత దర్శకుడు షాకింగ్ కామెంట్స్
AR Rahman Saira : ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్(AR Rahman Saira) సంచలన కామెంట్స్ చేశారు. తన భార్య హిందీలో మాట్లాడుతుండగా అడ్డు చెప్పాడు. హిందీలో మాట్లాడ వద్దని, తమిళంలో మాట్లాడాలంటూ సూచించాడు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
హిందీని ఒప్పుకునే ప్రసక్తి లేదని , తమిళాన్ని తక్కువ చేసి మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా హిందీని అమలు చేస్తామని చెప్పిన వెంటనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తీవ్రంగా తప్పు పట్టారు. హిందీ భాష కంటే ఈ దేశంలో అత్యంత పురాతనమైన భాష తమిళం అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి చేసిన ట్వీట్ కలకలం రేపింది.
తాజాగా ఓ కార్యక్రమంలో తన భార్య సైరా(AR Rahman Saira) హిందీలో మాట్లాడింది. దీనిని తప్పు పట్టాడు. హిందీలో కాదు తమిళంలో మాట్లాడాలంటూ సూచించాడు. జై హో కంపోజర్ చెన్నైలో సైరా భానుతో కలిసి వేదికపై అవార్డును స్వీకరిస్తున్నట్లు కనిపించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
Also Read : మోదీతో భేటీ అద్భుతం – ముకుందన్