AR Rahman : రీమిక్స్ కల్చర్ పై రెహమాన్ ఫైర్
సంగీతానికి ప్రమాదకరమని కామెంట్
AR Rahman : భారతీయ దిగ్గజ సంగీత దర్శకుడిగా పేరొందిన అల్లా రఖా రెహమాన్(AR Rahman) షాకింగ్ కామెంట్స్ చేశారు. సంగీత ప్రపచంలో ఎల్లలు దాటిన అతడి ప్రతిభా పాటవాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. వందలాది మంది కొత్త గాయనీ గాయకులను పరిచయం చేశాడు.
ఈ తరుణంలో రీమిక్స్ సాంగ్స్ కల్చర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీమిక్స్ కల్చర్ వల్ల అసలైన సంగీతం దెబ్బ తింటుందన్నాడు. మంగళవారం ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన రీతిలో జవాబులు చెప్పాడు. పాటకు ఉన్న పరిమితులు ఏమిటో తెలియకుండా చేస్తున్నారు.
ఇవాళ విడుదలైన పాటలు కొద్ది గంటల తర్వాత రీమిక్స్ కు నోచుకుంటున్నాయని దీని వల్ల ఏవి అసలైన సాంగ్స్ ఏవి నకిలీవో తెలియకుండా పోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు ఏఆర్ రెహమాన్(AR Rahman). ఏది ఏమైనా రీమిక్స్ కల్చర్ ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించాడు.
దీనిని తానే కాదు ఏ సంగీత తర్శకుడు, గాయనీ గాయకులు సపోర్ట్ చేయడని పేర్కొన్నాడు రెహమాన్. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేసిన పలు జనాదరణ పొందిన సాంగ్స్ ను రీమిక్స్ చేశారని దీని వల్ల అసలైన పాటల కు సంబంధించిన ఎస్సెన్స్ ను ఆస్వాదించ లేక పోతున్నారని పేర్కొన్నాడు ఏఆర్ రెహమాన్.
తాను రీమిక్స్ చేసేందుకు ఇష్టపడనని స్పష్టం చేశాడు సంగీత దర్శకుడు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరాడు.
Also Read : ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు