Sonia Gandhi Painting : ఆకట్టుకున్న సోనియా చిత్రం
వాషింగ్టన్ డీసీలో రాహుల్ కు బహూకరణ
Sonia Gandhi Painting : సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె మహిళా లోకానికి ఒక ఆదర్శ ప్రాయమైన నాయకురాలిగా ఇప్పటికీ గుర్తిస్తారు. ప్రధానంగా భారత దేశ రాజకీయాలలో కీలకమైన వ్యక్తిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఐరన్ లేడీగా గుర్తింపు పొందిన దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకి కోడలిగా వచ్చిన సోనియా గాంధీ(Sonia Gandhi) ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.
కొద్ది కాలం పాటు మాత్రమే ఆమె తన జీవితాన్ని ఆనందంగా గడిపారు. తనను ఆదరించి, చేరదీసిన అత్తను కోల్పోయారు. ఇంట్లో ఉండగానే అంగ రక్షకుల చేతిలో ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఇది తట్టుకోలేక పోయింది. ఇదే సమయంలో తను ప్రాణప్రదంగా ప్రేమించిన భర్త రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్నారు.
ఎంతో వేదనకు, బాధకు లోనైన సోనియా గాంధీ శక్తివంతమైన మహిళగా, నాయకురాలిగా ఎదిగారు. ఆమెకు గుర్తుగా ప్రముఖ ఆర్టిస్ట్ , మీడియా ప్రొఫెషనల్, ఫెమినిస్ట్ గా పేరు పొందిన సరితా పాండే చిత్రాన్ని (పెయింటింగ్ ) గీసింది స్వహస్తాలతో. దీనిని అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి అందజేసింది వాషింగ్టన్ డీసీలో.
ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ సందర్బంగా ఒక తల్లి ఇంకో తల్లికి ఇస్తున్న అరుదైన కానుక అని పేర్కొంది. సరితా పాండేను ప్రత్యేకంగా అభినందించారు రాహుల్ గాంధీ. దీనిని తన తల్లికి చేరుస్తానని హామీ ఇచ్చారు.
Also Read : Rahul Gandhi Birsa Munda : పోరాట యోధుడు బిర్సా ముండా