Arvind Kejriwal: పోలీసు అధికారిపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు !
పోలీసు అధికారిపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు !
Arvind Kejriwal: పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గతంలో తమనేత మనీశ్ సిసోడియాను బలవంతంగా లాక్కెళ్లింది కూడా ఆయనేనని వెల్లడించారు. రౌజ్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అప్లికేషన్ లో ఈ విషయాన్ని ఆయన పేర్కొన్నారు. తన భద్రతా వలయంలో ఉన్న సిబ్బంది నుంచి ఆయన్ను తొలగించాలని కోరారు. అయితే ఈడీ సిబ్బంది తనతో మర్యాదగానే ప్రవర్తించారని వెల్లడించారు. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్… ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ వేసిన రిమాండ్ పిటిషన్ విచారణలో భాగంగా కేజ్రీవాల్‌ను(Arvind Kejriwal) రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఆ సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఏకే సింగ్ తనతో దురుసుగా ప్రవర్తించారని సీఎం వెల్లడించారు. గతంలోనూ ఆ అధికారిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పట్లో వాదనల అనంతరం కోర్టు గది నుంచి సిసోడియాను బయటకు తీసుకువస్తుండగా.. మీడియా ఆయన్ను చుట్టుముట్టింది. అప్పుడు సింగ్ విలేకర్ల ఫోన్లను తోసేశారు. ‘‘రౌస్ అవెన్యూ కోర్టులో సిసోదియాతో ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి’’ అని దిల్లీ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. ఆ దృశ్యాలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘మనీశ్ జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా ? లేదంటే ఇలా చేయమని పోలీసులను ఎవరైనా ఆదేశిస్తున్నారా ?’’ అంటూ కేంద్రంపై పరోక్షంగా మండిపడిన సంగతి తెలిసిందే.
Arvind Kejriwal – ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు !
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ, ఐటీ అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. దీనిలో భాగంగా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ కు చెందిన పలు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దీనిపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ… ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడంలో బీజేపీ బిజీగా ఉందని… ఈ దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేసారు. ఇదిలా ఉంటే… మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను ప్రత్యేక న్యాయస్థానం ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.
Also Read : Chandrababu : విశాఖలో డ్రగ్స్ దందాలో వైసీపీ నేతల హస్తం – చంద్రబాబు