Arvind Kejriwal : త్వరలో ఢిల్లీ వాసులకు ఉపశమనం
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయక చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ కారణాల రీత్యా ఢిల్లీ లోని వివిధ ప్రాంతాలకు నీరు వచ్చి చేరిందన్నారు. శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం. ఐటీఓలో, డ్రెయిన్ లో చీలక కారణంగా , డ్రెయిన్ నుండి నీరు వెనుకకు ప్రవహించడం వల్ల రాజ్ ఘాట్ వద్ద నీరు నిలిచి ఉందని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). యమునా నది పొంగి పొర్లడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఎగువన పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయని దీని వల్ల యమునా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోందని పేర్కొన్నారు. చాలా చోట్ల యమునా నది ఉగ్ర రూపుం దాల్చుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టేలా ఉందన్నారు. నీటి మట్టం తగ్గితే ఢిల్లీ నగర వాసులకు ఉపశమనం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం.
ఇదిలా ఉండగా ఉత్తర భారతాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ ఎత్తున కురుస్తున్న వర్షాల తాకిడికి పలు చోట్ల ఇళ్లు కూలి పోయాయి. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ , ఒడిశా, ఢిల్లీ, హర్యానా ప్రాంతాలు ఎక్కువగా రెయిన్ ఎఫెక్ట్ కు గురయ్యాయి.
Also Read : Dasoju Sravan : దాసోజు శ్రవణ్ కు బెదిరింపు కాల్స్