Dasoju Sravan : దాసోజు శ్ర‌వ‌ణ్ కు బెదిరింపు కాల్స్

రేవంత్ పై మాట్లాడితే జాగ్ర‌త్త‌

Dasoju Sravan : బీఆర్ఎస్ అగ్ర నేత డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. ఈ మేర‌కు త‌న‌కు అర్ధ‌రాత్రి 12.15 గంట‌ల‌కు ప‌దే ప‌దే కాల్స్ వ‌చ్చాయ‌ని, తాము రేవంత్ రెడ్డి అనుచ‌రుల‌మ‌ని చెప్పార‌ని పేర్కొన్నారు. త‌మ నేత‌పై మాట్లాడితే ఊరుకోమంటూ త‌న‌ను బెదిరించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ అస‌భ్య ప‌దజాలం ఉప‌యోగించారంటూ ఆరోపించారు దాసోజ్ శ్ర‌వ‌ణ్.

ఈ మొత్తం ఫోన్ కాల్స్ వ్య‌వ‌హారంపై తాను సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ , సంబంధిత పోలీసు అధికారుల‌కు అధికారికంగా ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. ఈ బెదిరింపు కాల్స్ పై విచార‌ణ జ‌రిపి దోషుల‌ను గుర్తించి, చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాన‌ని పేర్కొన్నారు దాసోజు శ్ర‌వ‌ణ్(Dasoju Sravan). తెలంగాణ‌లో బెదిరింపు, రౌడీ రాజ‌కీయాల సంస్కృతిని పెంచి పోషించే ప‌నిలో రేవంత్ రెడ్డి నిమ‌గ్న‌మై ఉన్నారంటూ ఆరోపించారు.

గ‌తంలో కూడా త‌న అనుచ‌రుల ద్వారా వి. హ‌నుమంత రావు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, త‌దిత‌ర సీనియ‌ర్ల‌తో పాటు స్వంత పార్టీ స‌భ్యుల‌పై ఇలాంటి బెదిరింపుల‌కు పాల్పడ్డారంటూ మండిప‌డ్డారు. ఈ రౌడీ రాజ‌కీయాలు, చౌక‌బారు వ్యూహాలు , ప్ర‌జాస్వామ్యం, న్యాయం కోసం పోరాడ‌కుండా త‌న‌ను అడ్డు కోలేవంటూ తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు దాసోజు శ్ర‌వ‌ణ్.

Also Read : Aware Madhavan : పేద‌ల బాంధ‌వుడు మాధ‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!