Asaduddin Owaisi Jaleel : మహిళా బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం
బిల్లుకు వ్యతిరేకంగా ఓవైసీ..జలీల్ ఓటు
Asaduddin Owaisi Jaleel : ఢిల్లీ – చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టింది. భారీ ఖర్చుతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనంలో దీనిని ముందుగా ప్రవేశ పెట్టారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా మహిళా బిల్లుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ బిల్లు చట్టంగా రూపొందలేదు. దీంతో తిరిగి కొన్ని సవరణలు చేసింది మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ(BJP) సంకీర్ణ సర్కార్.
Asaduddin Owaisi Jaleel Opposed Women Bill
ఈ మేరకు తొలుత లోక్ సభలో ప్రవేశ పెట్టారు. మొత్తం 545 ఎంపీలకు గాను 456 మంది హాజరయ్యారు. వీరిలో ఇద్దరు ఎంపీలు వ్యతిరేకించారు. వారు ఎవరో కాదు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పార్టీకి చెందిన మరో ఎంపీ ఇంతియాజ్ జలీల్.
ఈ ఇద్దరు ఎంపీలు కరడుగట్టిన మతతత్వ వాదులని మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమకు స్వేచ్ఛ కావాలని కోరుతున్నారు. ఈ తరుణంలో ఈ మహిళా బిల్లు వల్ల భారత దేశంలోని చట్ట సభల్లో ప్రాతినిధ్యం సమకూరుతుంది.
బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఓవైసీ, జలీల్ పై బీజేపీ ఎంపీలు మండి పడుతున్నారు.
Also Read : Womens Reservation Bill : మహిళా బిల్లుకు ఆమోదం