Asaduddin Owaisi : పార్టీలకు ముస్లింలు ఏటీఎం యంత్రాలు
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ షాకింగ్ కామెంట్స్
Asaduddin Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో పార్టీలకు ముస్లింలు ఏటీఎం మెషిన్లుగా మారారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో పర్యటించిన ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తున్నట్లు ఎద్దేవా చేశారు ఎంపీ.
ముస్లింలు పార్టీలకు ఓట్ల ఏటీఎం యంత్రాలుగా మారడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో జేడీఎస్ కాంగ్రెస్ లో ముస్లింలకు గౌరవం లేదని ఆరోపించారు ఓవైసీ. కర్నాటకలోని హుమ్నాబాద్ లో జరిగిన సభలో ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లలో సెక్యులర్ పార్టీలు కూడా ముస్లింలను గుర్తించడం మొదలు పెట్టాయంటూ ఆరోపించారు.
భారత రాజకీయాల్లో ముస్లింలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండడం లేదన్నారు ఓవైసీ. కేవలం సమాజం నుంచి ఓట్లు అడిగే రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. ఎవరు మన వైపు ఉన్నారనే దానిపై ముస్లింలు ఎరుకతో ఉండాలని సూచించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎవరు మనతో లేరని ఆవేదన చెందారు.
భారత రాజకీయాలను అత్యంత హీన స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత ఒక్క బీజేపీకి, ప్రధానంగా నరేంద్ర మోదీకి దక్కుతుందని ధ్వజమెత్తారు ఓవైసీ. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియ చేస్తున్నానని చెప్పారు.
గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది నిందితులను విడుదల చేసిన ఘనత గుజరాత్ సర్కార్ కు దక్కిందన్నారు. దీనిని ఎందుకు ఖండించడం లేదంటూ ప్రశ్నించారు.
Also Read : పాత చట్టాలకు కేంద్రం మంగళం – రిజిజు