Ashok Gajapathi Raju: టీడీపీకి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా

టీడీపీకి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా

Ashok Gajapathi Raju : గోవా గవర్నర్‌ గా టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా టీడీపీ హై కమాండ్‌ కి తన రాజీనామా లేఖను పంపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్లా శ్రీనివాస్ కు తన రాజీనామా లేఖను పంపించారు.

Ashok Gajapathi Raju Resigned

ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్లు టీడీపీలో (TDP) ఉన్నానని, పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. పార్టీ, నేతలతో ఉన్న మధుర క్షణాలని ఆయన గుర్తు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి అశోక్ గజపతిరాజు ఎంతగానో సేవలు అందించారని నేతలు కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా తనకు న్యాయం చేశారని చెప్పుకొచ్చారు అశోక్ గజపతిరాజు. పసుపు శుభసూచకమని, పసుపుని నమ్ముకున్న వారు ఎవరైనా బాగుంటారని తెలిపారు. కాగా, శుక్రవారం సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో అర్చక స్వాములు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద అశోక్ గజపతిరాజును శాలువాతో మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ సత్కరించారు.

ఈ నెల 26 గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం

హిందువులు పవిత్ర మాసంగా భావించే శ్రావణమాసంలో ఈ నెల 26న గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. శుక్రవారం తన బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ… ఈ నెల 21న గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయాలని సీఎం ప్రమోద్ సావంత్ తనను కోరినట్లు తెలిపారు. అయితే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో అంటే ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం ప్రమోద్ సావంత్ కు తెలిపామన్నారు. అంతేకాదు రాజ్ భవన్ వర్గాలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా ఈ సమాచారం తెలియజేసామన్నారు.

Also Read : CM Chandrababu Naidu: భవిష్యత్ లో హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ – సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!