Ashok Gehlot : సోనియా గాంధీకి గెహ్లాట్ క్షమాపణ
కాంగ్రెస్ చీఫ్ రేసులో నేను లేను
Ashok Gehlot : రాజస్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడనుందా. అవుననే అనిపిస్తోంది. గురువారం ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి తాను క్షమాపణ కోరుతున్నానని తెలిపారు.
ఈ మేరకు తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయనంటూ ప్రకటించారు. గత కొంత కాలంగా ఆయన పోటీ చేస్తారని అంతా భావించారు. చివరకు మేడం సోనియా కూడా ఓకే చెప్పారు.
కానీ అంతలోపు ఏమైందో ఏమో కానీ రాజస్థాన్ లో నువ్వా నేనా అన్న రీతిలో పాలిటిక్స్ చోటు చేసుకున్నాయి. ఓ వైపు సచిన్ పైలట్ ఇంకో వైపు అశోక్ గెహ్లాట్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది.
చివరకు మేడం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 90 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) కు మద్దతుగా తాము రాజీనామా చేస్తామంటూ ప్రకటించారు. కానీ సీఎంగా సచిన్ పైలట్ ను ఒప్పుకునే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. ఆపై పరిశీలకులుగా ఉన్న అజయ్ మాకెన్ , మల్లికార్జున్ ఖర్గే లను కూడా కలుసుకునేందుకు ఒప్పు కోలేదు.
దీనిపై వ్యవహారం సీరియస్ కావడంతో దిద్దుబాటు చర్యలకు రంగంలోకి తానే స్వయంగా దిగారు సీఎం అశోక్ గెహ్లాట్. ఈ మేరకు ఇవాళ సోనియా గాంధీ నివాసంలో కలుసుకున్నారు.
తాను పోటీ చేసే ఆలోచనలో లేనని, తన ఫోకస్ అంతా రాజస్థాన్ రాష్ట్రంపై ఉందని స్పష్టం చేశారు. చివరకు సోనియా గాంధీ శాంతించడంతో ఇక సంక్షోభానికి తెర పడినట్లేనని భావిస్తున్నారు. మొత్తంగా టీకప్పులో తుపానుగా మారింది.
Also Read : అశోక్ గెహ్లాట్ అవుట్ దిగ్విజయ్ సింగ్ ఇన్