Rajasthan Congress : విభేదాలు వీడి ఎన్నికలకు రెడీ
సచిన్ పైలట్.. గెహ్లాట్ కుదిరిన రాజీ
Rajasthan Congress : కర్ణాటక ఫార్ములా బాగా వర్కవుట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ముందు విభేదాలు వీడండి. ఆ తర్వాత పవర్ లోకి రండి. పోస్టుల సంగతి, పవర్ సంగతి చూసుకుందామని హిత బోధ చేసింది ఏఐసీసీ. రాజస్థాన్(Rajasthan) లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ , మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి. స్వంత పార్టీలో ఉంటూనే సచిన్ పైలట్ ధిక్కార స్వరాన్ని వినిపించారు.
ఆపై ప్రభుత్వాన్ని పదే పదే తూలనాడుతూ , ప్రశ్నిస్తూ..నిలదీస్తూ వచ్చారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఒకరోజు దీక్ష చేపట్టారు. ఇదంతా డ్రామా అని సీఎం బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఐఏసీసీ సీరియస్ గా స్పందించింది. ఆ మేరకు సచిన్ పైలట్ కు నోటీసు జారీ చేసింది. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాట్లాడు కోవాలని ఇలా బయట పడితే బాగుండదని హెచ్చరించింది.
చివరకు రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నా సీఎం, మాజీ డిప్యూటీ సీఎం వినలేదు. చివరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దీనిపై ఫోకస్ పెట్టారు. వెంటనే రావాలని ఆదేశించారు. దీంతో ఇద్దరూ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. చివరకు గెహ్లాట్, పైలట్ మధ్య రాజీ కుదిరిందని వారిద్దరూ ఇక నుంచి పార్టీ గెలుపు కోసం పని చేస్తారని సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Also Read : Manish Sisodia