Atchannaidu : అమరావతి – ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి టీడీపీ , జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇరు పార్టీలు కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతాయని పేర్కొన్నారు.
Atchannaidu Comment about Alliance
ఇందులో భాగంగా టీడీపీ జాతీయ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీ స్కిల్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు నెల రోజులకు పైగా పూర్తయింది. ఇంకా బెయిల్ రాలేదు.
దీంతో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు అచ్చెన్నాయుడు(Atchannaidu) తెలిపారు. ఈ మేరకు టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపట్టేందుకు కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ కమిటీలో ఏపీ టీడీపీ చీఫ్ గా ఉన్న తనతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ , మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నియమించడం జరిగిందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.
Also Read : Swaroopananda Swamy : కనక దుర్గమ్మ జగన్మాత