CV Ananda Bose : ఆడిట్ కు రాష్ట్ర వ్య‌వ‌స్థ అవ‌స‌రం

పశ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్

CV Ananda Bose : ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ పంచాయ‌తీ నిధుల‌ను ఆడిట్ చేసేందుకు రాష్ట్ర స్థాయి వ్య‌వ‌స్థ‌ను కోరుతున్నారు. పంచాయ‌తీ రాజ్ సంస్థ నిధుల‌పై 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మ‌న్ త‌న మ‌ధ్యంత‌ర నివేదిక‌ను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు స‌మ‌ర్పించారు. రాష్ట్ర స్థాయిలో ఆడిట్ వ్య‌వ‌స్థ‌పై చ‌ర్చ జ‌రిగింది.

పంచాయ‌తీరాజ్ ఇన్ స్టిట్యూష‌న్ (పీఆర్ఐ) నిధుల‌ను ఆడిట్ చేసేందుకు క‌చ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఓ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్. ఈ మేర‌కు ఐద‌వ రాష్ట్ర ఫైనాన్స్ క‌మిష‌న్ చైర్మ‌న్ అభిరూప్ స‌ర్కార్ ను గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద బోస్ సూచించారు.

ఈ కీల‌క స‌మావేశంలో పంచాయ‌తీరాజ్ సంస్థ నిధుల ఆడిట్ పై విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింది. కమిష‌న్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు కేటాయించిన‌నిధులు పంచాయ‌తీల‌కు బ‌దిలీ చేయ‌బ‌డుతాయో లేదో ప‌రిశీలించేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌చ్చ‌ని గ‌వ‌ర్న‌ర్ ఆనంద బోస్(CV Ananda Bose)  సూచించారు.

ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఖ‌ర్చుల పురోగ‌తిని ప‌రిశీలించి, ప‌ర్య‌వేక్షిస్తారు. ఆర్థిక‌, భౌతిక ల‌క్ష్యాల సాధ‌న‌లో పంచాయ‌తీరాజ్ సంస్థ‌ల ప‌నితీరును మ‌దింపు చేసే బాధ్య‌త‌ను స్వతంత్ర సంస్థ‌ల‌కు అప్ప‌గించ వ‌చ్చ‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. సోష‌ల్ ఆడిట్ పాల‌న‌ను గుణాత్మ‌క ఆడిట్ కు పెట్ట‌వ‌చ్చ‌ని , ప్ర‌గ‌తిపై ఎప్ప‌టిక‌ప్పుడు రిపోర్ట్ కార్డుల‌ను రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు.

స్థానిక సంస్థ ప‌నితీరు మూల్యాంక‌నాన్ని నిర్వ‌హించాల్సిన యాజ‌మాన్య ఆడిట్ ను ఎంపిక ప్రాతిప‌దిక‌న ప్ర‌వేశ పెట్ట‌వ‌చ్చ‌ని అన్నారు గ‌వ‌ర్న‌ర్ ఆనంద బోస్. మొత్తంగా గ‌వ‌ర్న‌ర్ చేసిన సూచ‌న ఇప్పుడు కీల‌కంగా మారింది.

Also Read : పిటిష‌న్ కొట్టివేత హైకోర్టు జ‌డ్జిగా గౌరి

Leave A Reply

Your Email Id will not be published!