AUS vs ZIM 2nd ODI : ఆసిస్ దెబ్బకు ఠారెత్తిన జింబాబ్వే
మూడు గంటల్లోనే మ్యాచ్ క్లోజ్
AUS vs ZIM 2nd ODI : ఆసిస్ తన హవాను కొనసాగిస్తోంది. జింబాబ్వేకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. కేవలం మూడు గంటల్లోనే మ్యాచ్ ను పూర్తి చేసింది. ఇది కూడా ఆ జట్టుకు ఓ రికార్డ్ గా భావించాలి.
బుధవారం జరిగిన రెండో వన్డేలో(AUS vs ZIM 2nd ODI) సత్తా చాటింది ఆసిస్. పసికూనలకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఒక రకంగా ఈ వన్డే మ్యాచ్ ను
టి20 మ్యాచ్ తరహాలో ముగించడం విస్తు పోయేలా చేసింది.
ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ పుణ్యమా అంటూ సంప్రదాయ క్రికెట్ కు
ప్రమాదం ఏర్పడిందని వాపోతున్నారు.
ఈ తరుణంలో రాను రాను టి20 తరహా పొట్టి ఫార్మాట్ లకు జనాదరణ లభిస్తోంది. ఇదిలా ఉండగా జింబాబ్వే టూర్ లో పర్యటించిన భారత జట్టుతో అద్భుతంగా రాణించిన ఆతిథ్య జట్టు ఉన్నట్టుండి ఆస్ట్రేలియాతో పూర్తిగా చేతులు ఎత్తేసింది.
ఇదిలా ఉండగా మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసిస్ వన్డే సీరీస్ కైవసం చేసుకుంది. 2-0 ఆధిక్యంతో కొనసాగుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసింది జింబాబ్వే జట్టు. నిర్ణీత 50 ఓవర్లకు గాను 27.5 ఓవర్లలో 96 పరుగులకే చాప చుట్టేసింది.
విచిత్రం ఏమిటంటే ఇదే ఆసిస్ తో తక్కువ స్కోర్ చేయడం. మొత్తం రన్స్ లలో సీన్ విలియమ్స్ 29 పరుగులతో టాప్ లో నిలిచాడు. సికిందర్ రజా 17
రన్స్ చేశాడు.
స్టార్క్ , జంపా చెరో మూడు వికెట్లు తీశాడు. కామెరాన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆసిస్ 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. స్మిత్ 43,
అలెక్స్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
Also Read : డిస్నీ హాట్ స్టార్ జీ గ్రూప్ ఒప్పందం