Justin Langer : ఏ జట్టు లేదా ఏ క్రీడా సంస్థ అయినా విజేతల్ని, విజయాలను కోరుకుంటుంది. కానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అనూహ్యంగా విజయాలు సాధించేలా ఆసిస్ జట్టును తీర్చి దిద్దిన హెడ్ కోచ్ ను వద్దను కుంది.
దీంతో హెడ్ కోచ్ గా ఉన్న మాజీ దిగ్గజ క్రికెటర్ జస్టిన్ లాంగర్ తన పదవికి గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది అతడి రాజీనామా.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఆసిస్ టూర్ లో ఘోరమైన ఓటమిని చవి చూసినందుకు గాను ఏకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు హెడ్ కోచ్ కూడా తప్పుకున్నారు తమ పదవుల నుంచి.
విచిత్రం ఏమిటంటే ఎనలేని విజయాల వెనుక లాంగర్ ఉన్నాడు. ఇంగ్లండ్ అపజయాలకు కారణం చూపుతూ హెడ్ కోచ్ గా ఉన్న హాజిల్ వుడ్ ను తప్పించారు.
ఎవరైనా సక్సెస్ వస్తే రాజీనామా చేయడం ఏమిటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా తాను హెడ్ కోచ్ గా ఉండాలని అనుకున్నాడు లాంగర్ .
దీంతో అతడికి ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా బోర్డు తో అనేక చర్చల అనంతరం జస్టిన్(Justin Langer) వైదొలిగారంటూ మేనేజ్ మెంట్ కంపెనీ స్పష్టం చేసింది.
ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇంత కాలం పాటు ఆసిస్ కు సేవలు అందించిన లాంగర్ తప్పు కోవడం బాధాకరమే. అయితే జట్టులో కొందరి ఆటగాళ్లతో లాంగర్ (Justin Langer)పొసగక పోవడమే కొంప ముంచిందని సమాచారం.
Also Read : ఇంగ్లండ్ టీమ్ హెడ్ కోచ్ పై వేటు