IND vs AUS 1st T20 : అటు బౌలింగ్ లో ఇటు ఫీల్డింగ్ లో చెత్త ప్రదర్శనతో భారత జట్టు ఆస్ట్రేలియాలతో(IND vs AUS 1st T20) జరిగిన మొదటి టి20 మ్యాచ్ ఓడి పోయింది.
ఇప్పటికే ఆసియా కప్ లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియాలో ఎలాంటి మార్పు కనిపించ లేదు.
బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా బౌలింగ్ లో చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. హార్దిక్ పాండ్యా మెరిసినా , సూర్య కుమార్ యాదవ్ దంచి కొట్టినా,
కేఎల్ రాహుల్ రాణించినా ఆస్ట్రేలియా ఆటగాళ్ల దూకుడు ముందు భారీ లక్ష్యం చిన్న బోయింది.
కామెరూన్ గ్రీన్ , మాథ్యూ వేడ్ దుమ్ము రేపారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆసిస్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ విషయానికి
వస్తే 4 వికెట్ల తేడాతో ఓడి పోయింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 రన్స్ చేసింది. స్టార్ హిట్టర్ గా పేరొందిన హార్దిక్
పాండ్యా సత్తా చాటాడు.
కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొని 7 ఫోర్లు 5 సిక్సర్లతో 71 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 55 చేసి పర్వాలేదనిపించాడు.
ఇక ఎప్పటి లాగే రోహిత్ శర్మ 11 రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ 2 , అక్షర్ పటేల్ 6, దినేష్ కార్తీక్ 6 పరుగులు చేసి నిరాశ పరిచారు. ఈ తరుణంలో
బరిలోకి దిగిన సూర్య యాదవ్ 25 బంతులు ఎదుర్కొని 46 రన్స్ చేశాడు.
ఎలీస్ 3, వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసిస్ సునాయసంగా ఛేదించింది. ఇంకా నాలుగు బంతులు మిగిలి
ఉండగానే విజయం సాధించింది.
కామెరున్ గ్రీన్ 30 బంతులు ఆడి 8 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 61 రన్స్ చేశాడు. వేడ్ 21 బంతులు ఆడి 45 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read : పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి ఖాయం