Auyutha Atirudra Yagam : అతిరుద్ర యాగం పోటెత్తిన భక్తజనం
కృష్ణ జ్యోతి స్వరూపానంద సారథ్యం
Auyutha Atirudra Yagam : భక్త జనసందోహంతో అలరారుతోంది శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ(Sri Sri Sri Krishnajyoti Swaroopananda Swamiji) ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తున్న 80వ విశ్వ శాంతి అతిరుద్ర మహా యాగం. భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామి వారి అనుగ్రహం కోసం వేచి చూస్తున్నారు.
Auyutha Atirudra Yagam in Jadcherla
ఈ యాగం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఆగస్టు 27 వరకు యాగాన్ని నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సామూహిక విశేష కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు గోపూజ, 7.30 గంటలకు తులసి పూజ, 9 గంటలకు సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం, 10 గంటలకు కోటి కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు సహస్ర నామం, లలిత సహస్ర నామం, సౌందర్య లహరి పారాయణం, 2 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు , రాత్రి 7 గంటలకు రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్చన, 8.30 గంటలకు తీర్థ ప్రసాదం భక్తులకు అందజేస్తున్నారు.
బుధవారం ఉదయం 7 గంటలకు ధన్వంతరి , నక్షత్ర, ధనలక్ష్మి హోమాలు ఘనంగా చేపట్టారు స్వామి వారు. గురువారం శ్రీలక్ష్మీ కుబేరం అష్టలక్ష్మీ ధాన్య లక్ష్మీ హోమాలు, సాయంత్రం 6 గంటలకు శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేపట్టనున్నారు. శుక్రవారం విశేష చండీ సహిత గజలక్ష్మీ హోమాలు , సాయంత్రం 6 గంటలకు సామూహిక విశేష లక్ష్మీ కుంకుమార్చన, లక్ష గాజులార్చన కార్యక్రమం కొనసాగుతుంది.
Also Read : Arvind Kejriwal : విజన్ ఉన్న నేత అరవింద్ కేజ్రీవాల్