Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ !

అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ !

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు… ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తెలిపారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య బయటపడిందని… నీరు సరిగ్గా రామ్‌లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే చోట, వీఐపీలు దర్శనం చేసుకునే చోట కారుతోందని దాస్‌ పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవని… ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పైకప్పు లీకేజీ సమాచారం అందుకున్న ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర… ఆలయానికి చేరుకుని పైకప్పుని వాటర్‌ప్రూఫ్‌గా మార్చేలా మరమ్మతు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొదటి అంతస్తు పనులు జులై చివరకి, మొత్తం ఆలయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందని మిశ్ర ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

Ayodhya Ram Mandir Roof Leakage

దాదాపు ఐదు దశాబ్దాలుగా హిందూ సమాజం ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో జరిగిన రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుక దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. సుమారు 500 సంవత్సరాల హిందువుల కోరికగా ఉన్న రామ మందిర నిర్మాణం చట్టం, న్యాయస్థానం అడ్డంకులను దాటుకుని పూర్తయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీనితో దేశ విదేశాల నుండి భక్తులు అయోధ్యకు పొటెత్తున్నారు. ఏంతో ప్రతిష్టాత్మంగా నిర్మించిన అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ ఏర్పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read : Surrogacy Leaves: ఇకపై సరోగసీ తల్లులకు కూడా ఆరు నెలల ప్రసూతి సెలవు !

Leave A Reply

Your Email Id will not be published!