Ayodhya Rammandir from Space: అంతరిక్షం నుండి చూస్తే అయోధ్య రామ మందిరం అదుర్స్ కదూ !
అంతరిక్షం నుండి చూస్తే అయోధ్య రామ మందిరం అదుర్స్ కదూ !
Ayodhya Rammandir: యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. జనవరి 22 సోమవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆవిష్కృతం కానున్న బాల రాముడి ప్రాణపత్రిష్ఠాపన మహోత్సవానికి అయోధ్య నగరం సిద్ధమయింది. ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి దేశ,విదేశాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు సమారు 10 లక్షల మంది హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు, హిందువులు ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృుతమైన ఏర్పాట్లు చేసింది.
ఈ తరుణంలో అంతరిక్ష రంగంలో తనదైన ముద్రవేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ఈ మహత్తర వేడుకలో భాగమైంది. అంతరిక్షం నుంచి అయోధ్య నగరం, రామమందిరం ఎలా కనిపిస్తున్నాయో ఫొటోలు తీసింది. ఆ ఫోటోలను ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) విడుదల చేసింది. ఈ ఫోటోలు డిసెంబర్ 16న తీసినప్పటికీ… రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తాజాగా విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలపై వైరల్‌గా మారుతున్నాయి. అయోధ్య రామమందిరంతో(Ayodhya Rammandir) పాటు దశరథ్ మహల్, సరయు నది, ఇటీవలే అభివృద్ధి పరిచిన అయోధ్య రైల్వే స్టేషన్ ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాయి. దీనితో అంతరిక్షం నుండి కూడా అయోధ్య రామ మందిరం అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Ayodhya Rammandir – రూ. 1100 కోట్లతో రామ మందిరం నిర్మాణం !
సుమారు 500 సంవత్సరాలుగా హిందూ సమాజం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్యలోని మొదటి దశ రామ మందిరం నిర్మాణం పూర్తయింది. నగారా శైలిలో 380 అడుగుల పొడవు, 250 అడుగు వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఈ రామ మందిరం నిర్మించారు. రామమందిరంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ మందిరానికి మొత్తం 392 స్తంభాలు, 44 గ్లేట్లు ఉన్నాయి. 161 అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా (జీ ప్లస్ 2) చేపడుతోన్న ఈ మందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. తాత్కాలిక మందిరంలోని పాత రామ్ లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని తెలిపారు.
Also Read : APCC Chief YS Sharmila: టీడీపీ, వైసీపీలు కేంద్రంలోని బిజేపీకు అమ్ముడుపోయాయి- ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల